కరెంట్‌షాక్‌తో యువకుడికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కరెంట్‌షాక్‌తో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన రామకృష్ణ కుమారుడు కరుణాకర్ అలియాస్ కర్ణ(17) ఎలక్ట్రిక్ లైటింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం మండలంలోని శానిటోరియం సమీపంలోని ఓ చర్చికి క్రిస్‌మస్ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేస్తుండగా, వైరును పైకి వేసే క్రమంలో 11కేవీ.విద్యుత్ తీగలపై పడి కరెంట్ షాక్‌కు గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గా యపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బా ధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. చికిత్సలు అందించిన అనంతరం ప రిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు.
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
– మరొకరికి గాయాలు
అర్ధవీడు (ప్రకాశం) : వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని గన్నెపల్లి–రంగాపురం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లు వెలికితీసే ట్రాక్టరు గన్నెపల్లి నుంచి యాచవరం వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పి పక్కనున్న సైడుకాలువలో పడిపోయింది. ట్రాక్టర్‌లో ఉన్న కడప జిల్లా మైదుకూరు మండలం రాబురాంపేటకు చెందిన ముత్యాల శ్రీను (44) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్‌లో ఉన్న ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఆకుమల్ల కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


