నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు నియోజకవర్గానికి చెందిన ఎం.శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 21న సీనియర్స్ జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపికలను కడప నగరంలోని జేేఎంజే జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్‌బాల్ సంఘం కార్యదర్శి రెడ్డయ్య తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరగనున్న రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
పెండ్లిమర్రి: మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రథమ చికిత్స కేంద్రాన్ని శుక్రవారం పెండ్లిమర్రి పీహెచ్‌సీపీ వైద్యాధికారి ప్రసాద్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లటూరులో నిర్వహిస్తున్న వరదారెడ్డి ప్రథమ చికిత్స కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించామని తెలి పారు. అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చికిత్స చేయకపోడంతో చికిత్స కేంద్రాన్ని సీజ్ చేసీ డీఎంహెచ్‌ఓకు తెలిపామన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల యం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎం.కామ్, ఎంఎస్‌సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రవేశాల గడువు 12వ తేదీకి ముగిసినప్పటికీ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి 20వ తేదీ పీజీలో ప్రవేశాలు చేసుకునేలా కళాశాలలకు అవకాశాన్ని కల్పించిందన్నారు. అభ్యర్థులు తమ బరిజనల్ సర్టిఫికెట్లతో విశ్వవిద్యాలయంలోని డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ –2025 రాసి అర్హత సాధించిన వారు, రాయని వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చన్నారు.
మదనపల్లె సిటీ: జేఎన్‌టీయూ సౌత్‌జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ప్రశాంత్ ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జేఎన్‌టీయూ సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్శిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబరిచి త్వరలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. కాలేజీలో శుక్రవారం కాలేజీ డైరెక్టర్ రామమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాయుడు, అధ్యాపకులు అభినందించారు.
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంఐటీఎస్–ఐపీఎఫ్‌సీ మదనపల్లె మద్దతుతో మదనపల్లె పట్టు –పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ దరఖాస్తు సమర్పించినట్లు యూనివర్సిటీ వీసీ సీ.యువరాజ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టుచీరలు ఉన్నతమైన నాణ్యత, మెరుపు,తేలిక లాంటి అల్లికకు ప్రసిద్ధి చెందాయన్నారు. మిట్స్ ఛాన్సలర్ ద్వారకనాథ్ మాట్లాడుతూ రైతులు, నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్ సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారన్నారు.
నియామకం
నియామకం


