వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పాటించాలి

Dec 20 2025 7:04 AM | Updated on Dec 20 2025 7:04 AM

వంద ర

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పాటించాలి

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పాటించాలి జెడ్పీలో పదోన్నతులు

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రతి పాఠశాల పదో తరగతి వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ షేక్‌ షంషుద్దీన్‌ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల (మెయిన్‌)లోని యాక్షన్‌ ప్లాన్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, యాక్షన్‌ ప్లాన్‌ ఏ విధంగా అమలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో తరగతి గదిలో మమేకమై ప్రిపరేషన్‌పై అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముబీన రెహనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లా ప్రజా పరిషత్‌ పరిధిలో జూనియర్‌ అసిస్టెంట్లు/టైపిస్టులుగా పని చేస్తున్న పలువురికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ వారికి పదోన్నతుల పత్రా లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, జెడ్పీ ఉపాధ్యక్షులు బాలయ్య, పరిపాలన అధికారి చాంద్‌బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వంద రోజుల  యాక్షన్‌ ప్లాన్‌ పాటించాలి  1
1/1

వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement