నేడు కెరీర్ ఫెస్ట్
కడప ఎడ్యుకేషన్: స్థానిక వైఎస్సార్ అడిటోరియం పక్కన ఉన్న నూర్జహాన్ షాదిఖానా – ఉర్దూ ఘర్‌లో శనివారం జిల్లా కెరీర్ యాక్టివిటీ ఎక్స్‌పో, ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ పేమ్రంత్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై శుక్రవారం సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 36 మండలాల నుంచి పాల్గొననున్నారని చెప్పారు. ప్రతి మండలం నుంచి 5 ప్రాజెక్టులు ప్రదర్శించాన్నారు. అందులో 3 కెరీర్ పాత్ మోడల్స్, 1 పెయింటింగ్, 1 వృత్తి విద్య/వృత్తి దుస్తుల పోటీ ఉండాలని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో మండల స్థాయి విజేతలందరూ పాల్గొనాలని సూచించారు. కాగా ఇంటర్మీయెట్ తర్వాత ఏ కోర్సులు చదివితే, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వంటి విషయాలపై ఈ ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల ద్వారా తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇందులో తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో ఆరోగ్య మేరీ, సెక్టోరియల్ అధికారులు, జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


