ప్రైవేటీకరణతో తీవ్ర నష్టం
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏపీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులకు మెడికల్ సీటు దొరికే అవకాశాలు ఉంటే.. మన రాష్ట్రంలోని విద్యార్థులు వారి కంటే మెరుగైన మార్కులు తెచ్చుకున్నా సీటు దక్కకుండా పోతోంది. అందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో విద్యార్థులందరం స్వచ్ఛందంగా పాల్గొన్నాం. – పాతకుంట హేమంత్‌రెడ్డి,
విద్యార్థి, చెన్నూరు.
ప్రభుత్వమే కాలేజీలు నడిపిస్తే పేదలకు మేలు
మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుంది. నీట్ పరీక్షలు రాసినప్పుడు ప్రభుత్వ కాలేజీలలో మంచి ర్యాంకు సాధించిన వారికి ప్రభుత్వ ఫీజులతోనే సీటు వస్తుంది. ప్రైవేట్ పరం చేయడం ద్వారా కాలేజీ యాజమాన్యం లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
–ఆర్షద్, ఇంటర్మీడియట్, జమ్మలమడుగు
ప్రైవేటీకరణతో తీవ్ర నష్టం


