పాలకుల కుట్రను అంతం చేసే సంతకం!
పాలకుల కుట్రను అంతం పలకడమే లక్ష్యంగా జన‘కోటి’సంతకంతో సమరమే చేసింది. యువత భవిత కోసం సంతకంతో మద్దతు పలికింది. ప్రై‘వేటు’పై కలంతో పోటెత్తింది. పాలకుల తీరును ఎండగడుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన మహా యజ్ఞంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంది. వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపింది. ప్రతి ఒక్కరూ ప్రైవేటీకరణపై గళమెత్తేలా చేసింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న తీరుపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
–కడపఎడ్యుకేషన్/జమ్మలమడుగు/కమలాపురం


