మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించే దిశగా కూటమి ప్రభు త్వం వేగంగా పావులు కదపడం దుర్మార్గం. వైద్య విద్య కళాశాలల పీపీపీ విధానం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంది. ఏళ్లపాటు ప్రభుత్వ భూమి, వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే వారికి ఆదాయవనరులుగా మారతాయి. వైద్య విద్య పూర్తిగా వ్యాపారమవుతుంది. మేనేజిమెంట్ కోటా ద్వారా ఇచ్చే 20 శాత సీట్లు (376) ఒక్కో సీటుకు దాదాపు రూ.50 నుంచి 60 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ అధిక ఫీజు కారణంగా సామాన్య విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారనడంలో సందేహం లేదు.
– అంకన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


