ఉత్సాహంగా క్రాస్ కంట్రీ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక టీవీఆర్ హైస్కూల్ సమీపంలో బాల, బాలికలకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ (దూరపు పరుగు) పోటీల్లో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో ప్రతి చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు బాలుర అండర్–16 విభాగంలో 2 కిలోమీటర్లు క్రాస్ కంట్రీ పోటీలో పి.ఇస్మాయిల్, పి.ఫరీద్ బాషా, అండర్–18 విభాగంలో 6 కిలోమీటర్లు పోటీలో ఎస్.షాహిద్, వి.పవన్, అండర్–20 విభాగంలో 8 కిలోమీటర్లు పోటీలో ఎల్.రాంభూపాల్‌రెడ్డి, ఎస్.దాదా దస్తగిరి, పురుషుల 10 కిలోమీటర్ల పోటీలో హర్ష, బాలికల అండర్–16 విభాగంలో 2 కిలోమీటర్లు పోటీలు ఎస్.లాల్‌బీ, షేక్ పాతిమా నస్రిన్, అండర్–18 విభాగంలో 4 కిలోమీటర్ల పోటీలో ఎం.రాధా, ఎస్.షాహిన్ ఎంపికయ్యారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా వివరించారు. వీరు ఈనెల 24న బుధవారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. వ్యాయామ సంచాలకులు లక్ష్మీ, రాఘవ, నాగేశ్వరరావు, సంజీవ్, శివ, సీనియర్ క్రీడాకారులు సికిందర్, సలీం ఈ పోటీల నిర్వహణలో సహకరించారని తెలిపారు.


