కడప ఐఎంహెచ్ పీజీ వైద్య విద్యార్థుల ప్రతిభ
కడప అర్బన్ : జిల్లా రిమ్స్ ఆవరణంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(ఐఎంహెచ్) పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎంఈలో ప్రతిభ కనబరిచారు. ఈనెల 13, 14 తేదీలలో నంద్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మానసిక వైద్య విభాగం సీఎంఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప రిమ్స్ ఆవరణంలోని ఐఎంహెచ్‌కు చెందిన పీజీ ఫైనలియర్ వైద్య విద్యార్థులు డాక్టర్ ఏ .శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీ చరిత క్విజ్ పోటీలలో పాల్గొని బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఐఎమ్‌హెచ్ వైద్యులు కడప ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. జమునను కలిశారు. ఆమె వైద్య విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎమ్‌హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రాముడు, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ డి. సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ షాహిద్ బాషా, డాక్టర్ సరిత, డాక్టర్ సందీప్, డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ నగేష్, డాక్టర్ విశాలాక్షి పాల్గొన్నారు.


