సేవలకు అంతరాయం
ఉద్యోగుల డిమాండ్లు ఇవీ...
కడప అగ్రికల్చర్: చంద్రబాబు సర్కార్ సహకార ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో సహకార సంఘం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ఉద్యోగుల ఆందోళన కారణంగా ఆయా రోజుల్లో లావాదేవీలు నిలిచిపోతుండంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగియడంతో పలువురు రైతులు ధాన్యం డబ్బులు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటంతో ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బంగారంపై రుణాలు తీసుకునే
రైతులకు అవస్థలు
చాలా మంది రైతులు రబీ పంటల పెట్టుబడి కోసం బంగారు నగల తాకట్టుపై అధికంగా రుణాలు తీసుకుంటారు. రూ. 88 పైసల వడ్డికే సహకారం సంఘాల్లో రుణాలు ఇస్తారు.దీంతో రైతులు బంగారు తాకట్టుెపెట్టి రుణాలు పొందుతారు. కానీ ఉద్యోగులు అందుబాటులో లేకపోడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.
జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలి.
2019, 2024 పెండింగ్‌లో ఉన్న వేతన సవవరణలు చేయాలి.
ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు.చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి.
ప్రభుత్వోద్యోగుల మాదిరిగా పదవీ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి.
ఉద్యోగులకు రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. ప్రతి ఉద్యోగికి రూ. 20 లక్షల టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి
డీసీఈబీ ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా సహకారం సంఘాల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి
ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి.
ఆందోళన కార్యక్రమాల వివరాలు..
డిసెంబర్ 16వ తేదీ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం సమర్పించడం.
డిసెంబర్ 22 రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం అందజేయడం.
29వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా, ఉన్నతాధికార్లకు వినతిపత్రం అందించడం.
2026 జనవరి ఽ5వ తేదీ నుంచి 26 జిల్లాలు పూర్తి అయ్యేవరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహాల దీక్షలు.
కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన
నిలిచిపోతున్న లావాదేవీలు
అవస్థలు పడుతున్న అన్నదాతలు
సేవలకు అంతరాయం


