● ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అర్పించి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు.


