లైన్ తప్పిన రైల్వే
కడప–బెంగళూరు రైల్వేలైన్‌కు.. కూటమి గ్రహణం
కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణం పనులు ఆగిపోయాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఈ రైల్వేలైన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను సక్రమంగా కేటాయించారు. ఆయన మరణాంతరం పనులు మందగించాయి. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ రైల్వేలైన్‌కు రూ.185 కోట్లు కేటాయిందిచి. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉంది. నిధుల కేటాయింపు లేకపోవడంతో పనులకు బ్రేక్ పడింది.
రైలుమార్గం:
కడప–బెంగళూరు
దూరం: 257 కి.మీ
వ్యయం: రూ.2వేల కోట్లు
ప్రారంభం: 2014
రాజంపేట: కడప–బెంగళూరు రైలుమార్గం నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టుకుంది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వాటా నిధులను విడుదల చేయలేదు. నిధులిస్తే నిర్మాణానికి ముందుకొస్తామన్న అభిప్రాయం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవి నుంచి వెలువడినట్లు తెలిసింది. ముచ్చటగా మూడో సారి అధికారంలో కొనసాగుతున్న ఎన్‌డీఏ పాలనలో ప్రతి బడ్జెట్‌లో అరకొరనిధులు కేటాయిస్తూ వచ్చింది. దీంతో రైలుమార్గం పనులు ముందుకుసాగలేదన్న అపవాదును కేంద్రం మూటకట్టుకుంది.
అందుబాటులోకి ఎప్పుడో..
గతంలో రైల్ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా కేంద్రరైల్వేశాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎంపిక చేసిన రైల్వే ప్రాజెక్ట్ జాబితాలోకి కడప–బెంగళూరు రైల్వేలైన్‌ను చేర్చారు. రాష్ట్రంలో ఏడురైల్వే ప్రాజెక్టుల్లో కడప–బెంగళూరు రైల్వేలైన్ ఒకటి కావడం గమనార్హం. రైలుమార్గం నిర్మాణం ప్రారంఽభమై 15 ఏళ్లు అవుతున్న పురోగతి లేదు. అయితే పెండ్లిమర్రి వరకు రైలుమార్గం పూర్తికావడంతో అక్కడి వరకు నంద్యాల–కడప డెమో రైలును కొంతకాలం నడిపించారు.
నాలుగుదశల్లో...
కడప–బెంగళూరు రైలుమార్గాన్ని నాలుగు దశల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వేశాఖ నిర్ణయించింది. మొదటిదశలో రూ.153కోట్ల కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేసింది. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు నిర్మాణం చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు.
ముందుకుసాగని పనులు: రెండో దశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు ఊయ్యలపాడు (చిత్తూరు), మూడో దశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్‌సరిహద్దు) మదగట్ట టు ముల్భాగల్ (కర్ణాటకరాష్ట్ర సరిహద్దు) నాలుగదశలో ముల్‌బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్ రూపుదిద్దుకుంది. అయితే పనులు ముందుకు సాగడం లేదు.
నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం
రాష్ట్రం వాటా మాట తుస్సు
నిధులిస్తేనే లైన్ నిర్మాణానికికేంద్రం మొగ్గు
ముందుకుసాగని పనులు
త్వరితగతిన పూర్తి చేయాలి
కడప–బెంగళూరు రైలుమార్గం పూర్తయితే ఉభయవైఎస్సార్‌జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేగాకుండా అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటికి రైలు వచ్చినట్లవుతుంది. బడ్జెట్‌లో అధికనిధులు కేటాయించి త్వరతిగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ఎన్‌డీఏ సర్కారుపై ఉంది.
–మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు
కడప–బెంగళూరు మధ్య రైలు నిర్మాణానికి 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు. దీనికి 2008–2009 బడ్జెట్‌లో ఆమోదం లభించింది. రూ.1000కోట్ల అంచనా వ్యయంతో రైలుమార్గం నిర్మాణపనులు కదిలాయి. 258కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే పనుల్లో కదలికలేదు. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు.
లైన్ తప్పిన రైల్వే
లైన్ తప్పిన రైల్వే
లైన్ తప్పిన రైల్వే


