యువకుడి దారుణ హత్య
కడప అర్బన్ : కడప నగర శివారులోని రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన వల్లపు వెంకటయ్య (27)ను కాలనీ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి సిమెంటు దిమ్మెతో తలపై బాది చంపేశారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సమాచారం తెలుసుకున్న వెంటనే కడప ఇన్‌చార్జి, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రక్తపు మడుగులో వెంకటయ్య పడి ఉండటాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, కర్నూలు నుంచి ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి పరిసర ప్రాంతాలను తనిఖీ చేయించారు. తర్వాత బంధువులు, స్నేహితులను విచారణ చేశారు. మద్యం మత్తులో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వెంకటయ్య రెండు వివాహాలు చేసుకున్నాడు. వీరిలో మొదటి భార్యకు కుమార్తె, కుమారుడు వున్నారు. వారు మనస్పర్థలతో విడిపోయారు. రెండవ భార్య భవితకు కుమార్తె, ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. ఈనెల 11వ తేదీన తన పుట్టింటికి వెళ్లింది. కొన్ని గంటల వ్యవధిలోనే తన భర్త హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకుని తన బంధువులతో ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించింది. వెంకటయ్య ప్రైవేట్ కార్గోలో డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అతని తల్లిదండ్రులు సుబ్బయ్య, సుబ్బమ్మ. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రసాద్, ప్రవీణ్, నవీన్‌లు అన్నయ్యలు. చివరి కుమారుడైన వెంకటయ్య ప్రస్తుతం హత్యకు గురయ్యాడు. తల్లి వల్లెపు సుబ్బమ్మ కువైట్‌లో పనులు చేసుకుంటూ ఉండేది. ఇటీవలే అక్కడి నుంచి వచ్చారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుడి తల్లి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
సంఘటన స్థలం, చుట్టుపక్కల ప్రాంతాలలో పోలీస్ అధికారులు, సిబ్బంది, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్, కర్నూలు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం తనిఖీలు చేశారు. డాగ్‌స్క్వాడ్ ద్వారా చుట్టుప్రక్కల ప్రాంతాలను చుట్టేసి వచ్చారు. నిందితులు ఇద్దరా? మరి ఎంత మంది వుంటారోనని విచారణ చేపట్టారు. నిందితులు వెంకటయ్యను హత్య చేసిన తరువాత తమకు అంటిన రక్తపు మరకలను ఓ ఇంటి వద్ద కుళాయి వద్ద శుభ్రం చేసుకుని వెళ్లినట్లు సమాచారం.
మనస్పర్థలా? మరేవైనా కారణాలా?
వెంకటయ్య హత్యకు గల కారణాలు నిందితులకు, మృతునికి మధ్య ఏర్పడిన మనస్పర్థలతో జరిగిందా? మరేదైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి వుంది. నిందితులు, వెంకటయ్యతో కలిసి సైనిక్‌నగర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలోకి ఈనెల 11వ తేదీన రాత్రి సమయంలో మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యం తాగిన తరువాత ఘర్షణకు పాల్పడి వెంకటయ్య తలపై సిమెంట్ దిమ్మెతో మోది హత్య చేశారు. మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరు అనే విషయంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అనుమానిత నిందితులు పరారీలో వున్నట్లు సమాచారం. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను చేపట్టారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లకముందు ప్రధాన రహదారిపై షాపుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
వెంకటయ్య మృతదేహం
డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలిస్తున్న పోలీసులు
కలిసి మద్యం తాగి.. ఆపై చంపేశారు
మనస్పర్థలా? మరేమైనా కారణాలా?
డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం, కర్నూలు
ఫోరెన్సిక్ బృందం పరిశీలన
ఘటన స్థలాన్ని పరిశీలించిన
ఇన్‌చార్జి డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్
యువకుడి దారుణ హత్య
యువకుడి దారుణ హత్య


