ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు
కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను
ప్రారంభించిన డీఐజీ కోయప్రవీణ్
ప్రొద్దుటూరు క్రైం: కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో ప్రజలు మరింత మెరుగైన పోలీసు సేవలు పొందుతారని కర్నూల్ డీఐజీ కోయప్రవీణ్ తెలిపారు. ప్రొద్దుటూరులోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ కాంపౌండ్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం డీఐజీ పునఃప్రారంభించారు. గతంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చాలా వరకు సీసీ కెమెరాలతో పాటు ఇతర విభాగాలు పని చేయలేదు. పట్టణంలోని ప్రధాన సర్కిళ్లలో కూడా సీసీ కెమెరాలు లేవు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది మాత్రమే పట్టణంలో బైక్‌లతో గస్తీ నిర్వహించేవారు. దీంతో డీఎస్పీ భావన, సీఐ సదాశివయ్యల ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 8 బ్లూకోల్ట్స్ కొత్త బైక్‌లను సమకూర్చారు. వీటిని డీఐజీ చేతుల మీదుగా ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ కోసం కృషి చేసిన టూ టౌన్ సీఐ, సిబ్బందికి డీఐజీ ప్రశంసా పత్రాలను అందచేశారు. సహకరించిన దాతలను డీఐజీ సన్మానం చేశారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ రాయలసీమలోనే ప్రొద్దుటూరు వాణిజ్య కేంద్రమని చెప్పారు. అలాంటి పట్టణంలో మెరుగైన, సురక్షితమైన పోలీసు సేవలు అందించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రారంభించామని తెలిపారు. కొత్తగా 123 సీసీ కెమెరాలు, వీడియోవాల్, ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు, జీపీఎస్‌తో అనుసంధానం చేసిన 8 బ్లూకోల్ట్ బైక్‌లు, ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాలను నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్‌బాబు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, సీఐలు సదాశివయ్య, నాగభూషణం, రాజగోపాల్, వేణుగోపాల్ ఎస్‌ఐలు రాఘవేంద్రారెడ్డి, సంజీవరెడ్డి, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.


