రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి (35) మృతదేహం వుంది. అతను ఈనెల 10వ తేదీన తీవ్ర అనారోగ్యంతో కడపలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల కోసం చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 11న మృతి చెందడంతో మృతదేహాన్ని మార్చురీలో వుంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రి సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి మెయిన్ గేట్ ఎదురుగా చనిపోయిన అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతను ఉదయం నుంచి ఆస్పత్రి పరిసరాల్లోనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉంటే ఔట్‌పోస్టులో సంప్రదించాలని ఔట్‌పోస్టు ఇన్‌చార్జి షబ్బీర్‌బాషా తెలిపారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
కలసపాడు : కలసపాడులోని పోరుమామిళ్ళ– గిద్దలూరు రోడ్డు కలసపాడు ఆర్సీఎం చర్చి వద్ద ఉన్న తెలుగుగంగ డిస్ట్రిబ్యూటరీ కాలువలో కలసపాడుకు చెందిన షేక్‌దస్తగిరి (63) మద్యం మ త్తులో పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉ న్నాయి. కలసపాడుకు చెందిన దస్తగిరి తన భా ర్య 10 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కు మారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయన కలసపాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉంటుండే వాడు. ఇటీవల ఆర్సీఎం చర్చి వద్ద ఓ ఇంటిని బాడుగకు తీసుకుని ఉంటున్నాడు. ఈయన గతంలో హమాలీ పని చేసేవాడు. వయసు పైబ డటంతో పని చేయలేక ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం కాలువలో దస్తగిరి మృతదేహాన్ని స్థా నికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐ సు భాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతు డి కుమార్తె షేక్‌మాబున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వృద్ధుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధి కె.సుగుమంచిపల్లె పునరావాస కేంద్రంలోని సీ బ్లాక్‌లో బుక్కుపట్నం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కడపు నొప్పి తాళ లేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లనాగన్న గారి సుబ్బరాయుడు(67) గురువారం రాత్రి కడపు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.అనిల్‌కుమార్ తెలిపారు.
ప్రొద్దుటూరు కల్చరల్ : బెంగాల్ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేందర మోదీ వందేమాతరం గేయాన్ని వివాదాస్పదం చేయడం విచారకరమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ పార్టీ శత వార్షికోత్సవాల్లో భాగంగా ‘వర్తమాన రాజకీయాలు – కమ్యూనిస్టుల కర్తవ్యం’ అన్న అంశంపై ప్రొద్దుటూరులో ఓ ఫంక్షన్ హాల్‌లో సదస్సు నిర్వహించారు. మొదట పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో ఈశ్వరయ్య మాట్లాడుతూ కేరళలో ఎన్నికలు జరిగితే అయ్యప్పస్వామిని, కర్ణాటకలో జరిగితే హిజాబ్ అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ ప్రయత్నించారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి.కాసీం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమానత్వం, సమాన హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, మద్దిలేటి, హరి, పల్లవోలు రమణ, ఇమాన్యుయేల్, బాదుల్లా, గంగా సురేష్, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం


