పెరిగిన చలి..
కశ్మీరీ అందాలు కడప ముంగిట వాలినట్లు.. నగరాన్ని మంచు దుప్పటి చుట్టినట్లు.. ప్రభాతవేళ..మంచు ఇలా కప్పేసింది. రవి కిరణాలకు చోటు లేదంటూ.. జనానికి చలిమంట దారి చూపింది.. రోజురోజుకు తీవ్రమవుతున్న చలికి.. పిల్లలు..వృద్ధులు వణుకుతుంటే.. ప్రకృతి ప్రేమికులేమో మంచుకౌగిట్లో మునిగి పరవశమవుతున్నారు. కడప నగరంలో కనిపించిన ఈ దృశ్యాలు కనువిందు చేశాయి. – ఫొటోలు.. మహమ్మద్ రఫీ, సాక్షి ఫొటో గ్రాఫర్, కడప
నలుగురికీ పట్టెడన్నం పెట్టే అన్నదాతకే పుట్టెడు కష్టమొచ్చింది. చేతికొచ్చిన పంట చేలోనే నేలకొరిగింది. మాయదారి తుపాను పచ్చని పంటను నిలువునా గాయం చేసింది. మోసులెత్తిన వరి కంకులు రైతు ఆశల్ని మట్టిలో కలిపింది. వల్లూరు, చెన్నూరు మండలాల్లో ఏ పొలం చూసినా ఇలా నేలవాలిన వరి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన మోంథా, తుపాన్లు కలిగించిన నష్టం తాలూకు ఛాయలే అన్నదాతలను వెంటాడుతున్నాయి.
– ఫొటోలు:
రమేష్ తీట్ల, సాక్షి ఫొటోగ్రాఫర్,కడప
ఒరిగిన వరి..
పెరిగిన చలి..
పెరిగిన చలి..
పెరిగిన చలి..
పెరిగిన చలి..


