విన్నపాలు..బుట్టదాఖలు
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన అర్జీలు పరిష్కారం కావడం లేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి.. కలెక్టరేట్ ముంగిటకొచ్చి కాగితాలు చేతబట్టి.. అధికారులకు దండాలు పెట్టి మరీ చేస్తున్న విన్నపాలు మరుక్షణంలోనే బుట్టదాఖలవుతున్నా యి. మళ్లీ మళ్లీ వస్తున్న వారి సంఖ్యే ఇందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జనం పోటెత్తారు. ప్రధానంగా భూమి సమస్య, పెన్షన్లు, ఇంటి స్థలాలు వంటి సమస్యలతో వస్తున్న వారు అధికంగా ఉన్నారు. అందులో కొన్ని...
నేను ఆటో డ్రైవర్‌ను. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కుడికాలు పూర్తిగా తొలగించారు. దీంతో ఏ పని చేయలేకపోతున్నాను. వైద్యులు కూడా 80 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరితే, కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినపుడు అర్జీ చేసుకోమని అంటున్నారు. – సుబ్బరాయుడు, దువ్వూరు
మాకు సర్వే నెంబరు 310/2బీలో 1.68 ఎకరాల పట్టా భూమి ఉంది. ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చ డం వల్ల అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కుటుంబ అవసరాల నిమిత్తం ఇతరులకు విక్రయించేందుకు వీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం 22ఏ నుంచి భూమిని మినహాయించాలి. – వడ్ల వీరమ్మ, వేల్పుచర్ల, ముద్దనూరు మండలం
విన్నపాలు..బుట్టదాఖలు
విన్నపాలు..బుట్టదాఖలు


