జోరుగా కోటిసంతకాల సేకరణ
ముద్దనూరు : వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. సోమవారం మండలంలోని పలుగ్రామాల్లో వైస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు కోటిసంతకాల సేకరణలో పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి,పార్టీ ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఆకుల రవికుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణ ఆపాలి
– వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు
పులివెందుల : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచనను కూటమి ప్రభు త్వం విరమించాలని.. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజా వైద్య వనరులను కార్పొరేట్‌లకు అప్పగించడం అనేది ప్రజా ఆరోగ్యాన్ని రాబందులకు అప్పగించినట్లేనని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణ పేర్కొన్నారు. సోమవా రం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట వారు ఐక్యవేదిక నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ వైద్య సేవలపై ఆధారపడి ఉన్నారని, మెడికల్ విద్యను ప్రైవేటు వ్యాపారంగా మార్చే ప్రయత్నం సామాన్యుల భవిష్యత్‌ను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు.వెనుకబడిన ప్రాంతాలను అన్యాయం చేయడమేనని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షుడు కేసీ సుబ్బరాయుడు, జిల్లా నాయకులు సగిలి రాజేంద్ర, మల్లేల జగదీష్, జాల జయవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.


