పేటీఎం మీటింగ్‌కు పేరెంట్స్‌ కరువు | - | Sakshi
Sakshi News home page

పేటీఎం మీటింగ్‌కు పేరెంట్స్‌ కరువు

Dec 6 2025 7:45 AM | Updated on Dec 6 2025 7:45 AM

పేటీఎ

పేటీఎం మీటింగ్‌కు పేరెంట్స్‌ కరువు

● పాఠశాలల రూపురేఖలు మార్చింది వైఎస్‌ జగనే: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కళాశాలలలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌) నిర్వహించారు. అయితే ఈ సమావేశాలకు చాలా చోట్ల తల్లిదండ్రులు కరువయ్యారు. చాలా పాఠశాలలు, కళాశాలలలో నిర్వహించిన పేరెంట్‌, టీచర్స్‌ మీటింగ్‌కు పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల సంఖ్య అధికంగా ఉన్నా తల్లిదండ్రులు 20 శాతం కూడా హాజరుకాలేదు. ఈ సమావేశాలకు హాజరైన కూటమి నేతలు తమ ప్రభుత్వ గొప్పలు చెప్పడం తప్ప పిల్లలకు పనికొచ్చే ఏ అంశాలను చెప్పలేదని పలువురు తల్లిదండ్రులు గుసగుసలాడుకున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే కదా ఈ పాఠశాలలన్నీ నాడు– నేడు ద్వారా ఇంతగా అభివృద్ధి చెందాయని మాట్లాడుకోవడం కనిపించింది.

జిల్లా వ్యాప్తంగా..

జిల్లావ్యాప్తంగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ 2026 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో నిర్వహించారు. ఇందులో 1966 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతోపాటు 24 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, 17 కేజీబీవీలలో, 17 సోసియల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో మరో 4 బీసీ వెల్ఫేర్‌ స్కూళ్లల్లో సమావేశాలను నిర్వహించారు.

స్పందన కరువు...

శుక్రవారం కడపలోని గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూల్లో నిర్వహించిన పేటీఎం సమావేశానికి తల్లిదండ్రుల నుంచి స్పందన కరువైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హాజరయ్యారు. కాగా.. ఈ పాఠశాలలో 800 మందికిపైగా పిల్లలుంటే కేవలం వందలోపే తల్లిదండ్రులు హాజరయ్యారు.

కడప ఎడ్యుకేషన్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చారని.. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ఆయనదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప మున్సిపల్‌ హైస్కూల్‌ మెయిన్‌లో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. అక్కడక్కడ 10 శాతం మేర పనులు పెడింగ్‌లో ఉన్నాయని ఆ పెండింగ్‌ పనులను కూటమి ప్రభుత్వం పూర్తిచేసి ఆ భవనాలను పిల్లలకు అందుబాటులోకి తేవాలన్నారు. తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ మీత్యాగం, మీశ్రమ పిల్లల విజయానికి పునాది లాంటిదన్నారు. ప్రతి రోజు పిల్లలను పాఠశాలకు పంపడం, సెల్‌ఫోన్‌లకు దూరంగా పెట్టడం, చదువుపై సంపూర్ణ దృష్టి పెట్టేలా చూడాలన్నారు. నేడు దేశానికి సేవలందిస్తున్న వేలాది మంది అధికారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని అన్నారు. బాగా చదువుకుని పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచిపేరును తేవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

పలుచోట్ల అంతంత మాత్రంగానే హాజరైన తల్లిదండ్రులు

జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సమావేశాల నిర్వహణ

పేటీఎం మీటింగ్‌కు పేరెంట్స్‌ కరువు 1
1/1

పేటీఎం మీటింగ్‌కు పేరెంట్స్‌ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement