● నియోజకవర్గాల తలసరి ఆదాయం
కడప సెవెన్‌రోడ్స్: 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి సవరించిన అంచనాల (ఎఫ్‌ఆర్‌ఈ) ప్రకారం స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో పులివెందుల నియోజకవర్గం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను జీవీఏ కొలుస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ఉత్పత్తి విలువను జీవీఏగా పేర్కొంటారు. ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేసేందుకు ఇదొక కీలక సూచిక. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, లైవ్‌స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషింగ్‌లలో పులివెందుల నియోజకవర్గం మొత్తం జీవీఏ 6,53,169 లక్షల రూపాయలుగా నమోదై మొదటిస్థానంలో ఉంది. పారిశ్రామిక రంగానికి సంబంధించిన మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, నిర్మాణ అంశాల్లో 3,43,205 లక్షల రూపాయలతో జమ్మలమడుగు మొదటి ర్యాంకు సాధించగా, 2,19,433 లక్షలతో పులివెందుల రెండవ స్థానంలో ఉంది. ఇక సర్వీసు సెక్టారుకు సంబంధించి ట్రేడ్, రిఫైర్, హోటల్ అండ్‌రెస్టారెంట్స్, రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్, వృత్తి సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ వంటి అంశాల్లో కడప నియోజకవర్గం 4,73,042 లక్షలతో మొదటి ర్యాంకులో ఉండగా, 3,09,120 లక్షలతో జమ్మలమడుగు రెండవ ర్యాంకులో నిలిచింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మొత్తం సీజీవీఏలో చూస్తే 11,43,074 లక్షలతో పులివెందుల ప్రథమ స్థానంలో ఉంది. జమ్మలమడుగు, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు ప్రొద్దుటూరు నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇకపోతే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల స్థూల దేశీయోత్పత్తి (సీడీపీ) 53,53,144 లక్షలు. మొత్తం జీవీఏ 49,52,231 లక్షలుగా నమోదైంది. ఇందులో వ్యవసాయ–అనుబంధ రంగాల వాటా 16,18,639 లక్షలు, పారిశ్రామిక రంగ వాటా 12,70,603 లక్షలు, సేవా రంగం వాటా 20,62,989 లక్షలుగా ఉన్నాయి.
2023–24 ప్రస్తుత ధరల ప్రకారం పులివెందుల రూ. 3,55,706లతో తలసరి ఆదాయంలో మొదటిస్థానంలో ఉంది. జమ్మలమడుగు రూ. 2,53,207, కమలాపురం రూ.2,44,911, మైదుకూరు రూ.2,00,644,, బద్వేలు రూ.1,86,786, కడప రూ.1,81,397, ప్రొద్దుటూరు రూ.1,38, 177లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
తలసరి ఆదాయంలో లింగాలకు మొదటి ర్యాంకు
అట్టడుగు స్థానంలో గోపవరం మండలం
జిల్లాలో ఐదు అగ్రశ్రేణి, ఐదు దిగువ శ్రేణి మండలాల గుర్తింపు
2023–24 మొదటి సవరించినఅంచనాల వెల్లడి
ఐదు దిగువ శ్రేణి మండలాల్లో 1,34,404 రూపాయలతో 36వ ర్యాంకులో గోపవరం మండలం అట్టడుగు స్థానంలో ఉంది. ఆ తర్వాత 1,35,760 రూపాయలతో 35వ ర్యాంకులో ప్రొద్దుటూరు, 1,41,305 రూపాయలతో 34వ ర్యాంకులో అట్లూరు మండలం, 1,57,237 రూపాయలతో 33వ ర్యాంకులో రాజుపాలెం మండలం, 1,61,309 రూపాయలతో 32వ ర్యాంకులో వీరపునాయునిపల్లె మండలాలు ఉన్నాయి.
జిల్లాలో 36 మండలాలు ఉండగా, తలసరి ఆదాయంలో ఐదు అగ్రశ్రేణి మండలాలు, ఐదు దిగువ శ్రేణి మండలాలుగా గుర్తించారు. అగ్రశ్రేణి మండ లాలను పరిశీలిస్తే.. రూ.7,38,828ల తలసరి ఆదా యంతో లింగాల మండలం అగ్రస్థానంలో నిలిచింది. అరటి తదితర ఉద్యాన పంటల సాగు విస్తృతంగా ఉండడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నా రు. ఆ తర్వాత రూ.4,95,955 వేముల మండలం రెండవ స్థానంలోనూ, ఆ తర్వాత 4,08,167 రూపాయలతో సింహద్రిపురం మండలం మూడవస్థానంలో ఉన్నాయి. ఇక 4,07,661 రూపాయలతో పెండ్లిమర్రి మండలం నాల్గవస్థానంలో, 3,96,892 రూపాయలతో ముద్దనూరు మండలం ఐదవ స్థానంలో ఉన్నాయి.
● నియోజకవర్గాల తలసరి ఆదాయం
● నియోజకవర్గాల తలసరి ఆదాయం
● నియోజకవర్గాల తలసరి ఆదాయం


