పెన్నాకు నీరు విడుదల
జమ్మలమడుగు రూరల్: మైలవరం జలాశయం నుంచి పెన్నాకు నీటిని విడుదుల చేసినట్లు మైలవరం జలాశయం ఈఈ రమేష్ తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జలాశయం నుంచి సుమారు 4300 క్యూసెక్కుల నీటిని అధికారులతో కలసి ఆయన విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 5 టీఎంసీల నుంచి మైలవరం జలాశయానికి ఇన్‌ఫ్లో ఉండడంతో.. వచ్చిన నీటిని అలాగే పెన్నాకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.01 టీఎంసీల నీరు ఉన్నట్లు ఆయన తెలిపారు.జలాశయం సహయం ఈఈ మూర్తి, ఏఈ సుబ్బారావు, రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


