వెలిగల్లు నుంచి ..
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న నేపధ్యంలో ముందుజాగ్రత్తగా ఇరిగేషన్‌శాఖ అధికారులు వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దిగువనున్న పాపా ఘ్ని నదికి 750 క్యూసెక్కులు చొప్పున ఒక గేటు ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 4.63 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.77 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అఽధికారుల ద్వారా తెలుస్తోంది. అలాగే సుండుపల్లె మండలంలోని పింఛాతోపాటు శ్రీనివాసపురం రిజర్వాయర్, జిల్లాలో ని వివిధ చెరువులకు నీరు వచ్చి చేరుతోంది.


