శంభో శివ శంభో !
నిండు మనసుతో చెంబుడు నీళ్లు గుమ్మరిస్తే చాలు.. అడిగిన వరాలిస్తాడు... భక్తితో ఒక మారేడు దళం సమర్పిస్తే ముక్తిని ప్రసాదిస్తాడు.. మా శివయ్య భోళా శంకరుడు... అంటూ భక్తులు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శివాలయాలన్నీ కార్తిక దీప కాంతులతో శోభిల్లాయి. తొలి దర్శనం చేసుకున్నా...తొలిదీపం పెట్టినా అధిక పుణ్య లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు తెల్లవారుజాము 3.30 గంటల నుంచే ఆలయాలకు క్యూ కట్టి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు.
● కార్తీక దీప కాంతులతో శోభిల్లిన శైవ క్షేత్రాలు ● భక్తిశ్రద్ధలతో కార్తిక తొలి సోమవారం
బి.కోడూరులోని అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమంలో 108 శివలింగాలు .. కడప అక్కాయపల్లెలో కోటి దీపోత్సవం.. పుష్పగిరిలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ
శంభో శివ శంభో !
శంభో శివ శంభో !


