బీఎడ్ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల య పరిధిలోని వైఎస్సార్ కడప, అన్న మయ్య జిల్లాలోని 17 కేంద్రాల్లో బీఎడ్ పరీక్షలు సోమ వారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను అన్ని కేంద్రాల్లో కలుపుకొని 21,665 మంది విద్యార్థులు రాస్తున్నారు. తొలిరోజు కడపలోని నాగార్జున డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిబంధనలను అనుసరించి జరపాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.ఎస్.వి.కృష్ణారావు వివరిస్తూ రెండు జిల్లాల్లోని అన్ని కేంద్రాలకు విశ్వవిద్యాలయం తరఫున అబ్జర్వర్లను నియమించామని తెలిపా రు. అలాగే స్క్వాడ్ బృందాల సభ్యులు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని వి.సికి వివరించారు. యూనివర్సిటీ సెంటర్ అబ్జర్వర్ తుమ్మలూరు సురేష్‌బాబు, చీఫ్ సూపరింటెండెంట్ రెడ్డప్ప పాల్గొన్నారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి సోమవారం పల్లకీ సేవ నిర్వహించారు.ముందుగా మూల విరాట్‌లు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, పూజలు జరిపారు. రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
గుంటిమడుగు
పెద్ద చెరువుకు గండి
రాయచోటి : రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని పెద్ద గోలాన్ చెరువుకు భారీ గండి పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోలాన్ చెరువులోకి వర్షపునీరు చేరింది. సోమవారం మధ్యాహ్నం గండిపడిన ప్రాంతాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు స్పందించి గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు.
కడప కోటి రెడ్డి సర్కిల్ : మోంథా తుపాను నేపథ్యంలో కడప నుంచి విశాఖపట్నం వెళ్లేతిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ జనార్ధన్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు
బీఎడ్ పరీక్షలు ప్రారంభం


