రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నియమితులై తొలిసారిగా విచ్చేసిన ఎంపీ మేడా రఘునాథరెడ్డిని మేడా భవన్(రాజంపేట బైపాస్ క్రాస్)లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేస్టాండింగ్ కమిటీలో సభ్యునిగా చోటు కల్పించినందువల్ల రైల్వేపరంగా ఈ ప్రాంతానికి అవసరమైన అంశాలపై దృష్టి సారించగలిగే అవకాశం కలిగిందన్నారు.
రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి దృష్టికి ఉమ్మడి కడప జిల్లాలోని రైలుమార్గంలో నెలకొన్న సమస్యలను తీసుకెళ్లనున్నట్లు గుంతకల్ డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడాభవన్‌లో ఎంపీ మేడాను కలిసి బొకేను అందచేశారు.కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ గాలివీటి వీరనాగిరెడ్డి,మార్కెట్‌మాజీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనరు కృష్ణారావు, నందలూరు సింగల్ విండో మాజీ అధ్యక్షుడు పాలగిరి సుధాకర్‌రెడి సౌమ్యనాధాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్,్డతోపాటు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ మేడా


