విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం

Oct 28 2025 7:52 AM | Updated on Oct 28 2025 7:52 AM

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం

వీరపునాయునిపల్లె : మోంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని విద్యుత్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రమణ అన్నారు. సోమవారం మండలంలోని అయ్యవారిపల్లె విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్చిన చర్యలపై సిబ్బందికి సలు సూచనలందించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయేంతవరకు అధికారుల, సిబ్బందికి సెలవులు రద్దుచేశామని.. ప్రతి ఒక్కరూ 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించా రు. సమావేశాననంతరం విలేకరులతో మాట్లాడు తూ తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కడప నుంచి కాకినాడకు 20బృందాలను పంపించామని వెల్లడించారు. సర్కిల్‌ కార్యాలయం కడప, కడప డివిజన్‌, పులివెందుల ప్రొద్దుటూరు, మైదుకూరులలో 5కంట్రోల్‌ రూమ్‌లు పని చేస్తున్నాయని వివరించారు. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు యల్‌యమ్‌సి సర్కిల్‌ కార్యాలయం కడప 9440817440, కడప డివిజన్‌ కార్యాలయం 9901761782, పులివెందుల 7893063007, ప్రొద్దుటూరు 7893261958,మైదుకూరు 9849057659 అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల డీఈ కిరణ్‌, ఏఈ హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement