ఉత్సాహంగా ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో సబ్ జూనియర్ ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు సోమవారం ఉత్సాహంగా సాగా యి. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్సార్ కడప, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎంపిక లు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి జనార్ధన రెడ్డి ఎంపికలను పర్యవేక్షించారు.
సబ్ జూనియర్స్ ఇండియన్ రౌండ్–బాలుర జట్టు:
కె. అరవింద్, ఎస్. శశి వర్ధన్, జి. సిద్ధార్ధ, టి.గణేష్, సి దినేష్ కుమార్
బాలికల జట్టు: టి.శివ దుర్గ, కె.నవ్య శ్రీ, వి.మధులిక
సబ్ జూనియర్స్ రికర్వ్ రౌండ్ బాలుర జట్టు:
వై.నవనీష్, ఎ.యశ్వంత్ రెడ్డి, ఎల్. కౌశల్ దేవ రాయల్, పి.విఘ్నేష్ చరణ్, బి.ఖ్యాతేష్, షణ్ముక
బాలికల జట్టు: టి. సుశ్రుత
సభ జూనియర్స్ కాంపౌండ్ బాలుర జట్టు: సి. అభినయ్, పివి. పాయి శ్రీనివాస్, కె. వెంకట కార్తీక్


