రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో ఉన్న డీఏవీ భారతి స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ గండిలోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బంగారు పతకం సాధించిన వైశాలి త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాజరవుతుందని ఆయన వివరించారు. కాగా భారతి సిమెంట్స్ ప్లాంట్ హెడ్ ఎం. రామమూర్తి, హెచ్‌ఆర్ గోపాల్ రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు.
సిల్వర్ జోన్ ఫౌండేషన్ లిటిల్ స్టార్స్‌లో
డీఏవీ విద్యార్థుల ప్రతిభ..
సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లిటిల్ స్టార్‌లో ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఒలంపియాడ్ (ఐఓఈఎల్) డీఏవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. తమ డీఏవీ భారతి స్కూల్‌కు చెందిన 147 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందాయన్నారు. అలాగే ఐదుగురికి వెండి, ఏడుగురు రజత పతకాలు అందుకున్నారని తెలిపారు. పతకాలు అందుకున్న విద్యార్థులను ప్లాంట్ ప్రతినిధులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి


