రక్తదానం.. ప్రాణదానంతో సమానం
ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య
కడప అర్బన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం నగరంలోని ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏ.ఆర్ అదనపు ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఎందరో అభాగ్యులు ఆపద సమయాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు, ఆర్.ఐ లు శివరాముడు, టైటస్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ టెక్నీషియన్ స్వరూప రాణి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


