పింఛా ప్రాజెక్టు పరిశీలన
సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టును జల వనరుల శాఖ డీఈ చెంగల్‌రాయుడు మంగళవారం పరిశీలించారు. పింఛా ప్రాజెక్టు నుంచి మంగళవారం 3632 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసినట్లు ఏఈఈ నాగేంద్ర తెలిపారు.
కడప కార్పొరేషన్: జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.6.59కోట్ల రాయితీలు విడుదలయ్యాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చాంద్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేది ‘ఎంఎస్‌ఎంఈలపై చిన్నచూపు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఇండస్ట్రియల్ పాలసీలలో రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, రాయితీలన్నీ ఒకేసారి చెల్లించాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు ఏడేళ్లుగా ఎలాంటి రాయితీలు విడుదల చేయలేదని, జిల్లాలో ఎంఎస్‌ఎంఈలకు రూ.156కోట్ల బకాయిలు ఉండగా రూ.6.59 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు.


