మెడికల్ కాలేజీల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కువైట్‌లో
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కువైట్ దేశంలో వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసాంఽధ్రులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. కువైట్‌లోని మాలియా ప్రాంతంలో మాక్స్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోడూరు మండల కన్వీనర్ రామిరెడ్డి, ధ్వజారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ కల్లూరు రమణారెడ్డి, కువైట్ పిస్తా హౌస్ అధినేత ఎస్‌బి అహ్మద్‌బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్యాన్ని అందించడానికి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ సలహాదారులు ఎన్. మహేశ్వర్ రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్లు ఎం. చంద్రశేఖర్ రెడ్డి, మర్రి కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, షేక్ రహమతుల్లా, అఫ్సర్ అలీ, యు.వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.


