యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : పట్టణంలోని ఫాతిమానగర్‌లో మంగళవారం ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కాశినాయన మండలం వడ్డమాను గ్రామానికి చెందిన యంబడి ప్రసాద్ (34) పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య ప్రతిమతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లల చదువు కోసం నాలుగు నెలల క్రితం పట్టణంలోని ఫాతిమానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని చేరారు. అయితే మంగళవారం భార్య పనికి, పిల్లలు స్కూలుకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని బంధువులు అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


