ప్రమాణస్వీకారం
సిద్దవటం: సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో గురువారం శ్రీ నిత్యపూజస్వామి పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్‌గా జంగిటి రాజేంద్రప్రసాద్, పాలకమండలి సభ్యులుగా పి.మల్లేశ్వరి, పి.వసంత, బి.వెంకటసుబ్బయ్య, వి.కృష్ణయ్య, ఆర్.పార్వతమ్మ, కె.మల్లీశ్వరి, సి.వెంకటసుబ్బయ్య, జె.శివారెడ్డి, కె.రూప, ఎక్స్ ఆఫీషియో సభ్యులు, అర్చకులు రంగసముద్రం సుబ్రమణ్యంశర్మల చేత ఈఓ శ్రీధర్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా చొప్పా ఎల్లారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మే రకు నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చొప్పా ఎల్లారెడ్డి గతంలో రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ చాన్సులర్ జయరామిరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు డిప్లిమాలో ఓ బ్రాంచ్ పాసైన వారైన అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కలలను సాకారం చేసే సృజనాత్మక విశ్వవిద్యాలయం ఏఎఫ్‌యూ అని తెలిపారు. ఇక్కడ Creativity. Technology, Arts , Design సమన్వయంతో రూపొందిన కోర్సులు విద్యార్థులకు విస్తృతమైన ఉద్యోగ , ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం 99855 88105, 90524 60323 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లా పరిధిలో వాహన యజమానులు వివిధ రకాల సేవల కోసం వాహన్ పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో 867 దరఖాస్తులు క్లియర్ చేశామని.. ఇంకా 387 పెండింగ్‌లో ఉన్నాయని జిల్లా ఇన్‌చార్జ్ ఉపరవాణా శాఖ కమిసనర్ వీర్రాజు పేర్కొన్నారు. గురువారం నగర శివార్లలోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫైనాన్షియర్ వెరిఫై చేస్తే తప్ప, ఈ దరఖాస్తులు రవాణా శాఖ కార్యాలయాలలో అప్రూవ్ చేయడానికి అవకాశం ఉండదన్నారు. ఈ దరఖాస్తుల వివరాలు జిల్లాలో గల రవాణా శాఖ కార్యాలయాలలో డిస్‌ప్లే చేశామని తెలిపారు. గత 50 రోజులలో ఫైనాన్సియర్‌ల నుంచి వెరిఫై అయిన 867 దరఖాస్తులు క్లియర్ చేశామని వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వారు ఒక లేఖ, ఫామ్ 35 జిరాక్స్, వాహన యజమాని ఆధార్ జిరాక్స్, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్ కలిపి తమ కార్యాలయానికి ఈనెల 31లోపు సబ్మిట్ చేయాలన్నారు. ఈ నెల 31 లోపు సబ్మిట్ చెయ్యని దరఖాస్తులను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు.
ప్రొద్దుటూరు కల్చరల్: మహాకవి డాక్టర్ గడియారం వేంకటశాస్త్రి 44వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభను ఈనెల 26న అరవిందాశ్రమంలోని అరబిందో ఇంటిగ్రల్ హైస్కూల్‌లో సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించనున్నట్లు రచన సాహిత్యవేదిక ఉపాధ్యక్షుడు గడియారం వేంకట శేషశర్మ తెలిపారు. గురువారం పురస్కార ప్రదాన సభ ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడియారం బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, అవధాని, విమర్శకులు అని.. ఆయన ఎన్నో కావ్యాలు రచించారన్నారు. ఆ మహానీయుని పేరుతో రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల ఆధ్వర్యంలో సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి 44 ఏళ్లుగా పురస్కారాలను అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌కు చెందిన యువకవి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరిమి శ్రీరామనాథ్ రచించిన జీవాతువుకు పురస్కారం ప్రదానం చేస్తున్నామన్నారు. సాహితీ ప్రియులు, అభిమానులు పురస్కార ప్రధానోత్సవ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


