పూల తోటంతా దెబ్బతినేలా ఉంది
వరుస వర్షాలతోపాటు నిన్నామొన్నా కురిసిన భారీ వర్షంతో పొలంలో నీరంతా నిలిచింది. కార్తీక మాసం కావడంతో ఇప్పుడిప్పుడే పూలధర కాసింత పెరిగింది. నాలుగు రూపాయలు వస్తుందని ఆశపడేలోపు ఈ వర్షం నట్టేట ముంచింది.
– కొమ్మద్ది. వెంకటసుబ్బయ్య,
లింగారెడ్డిపల్లె, సీకేదిన్నె మండలం
పెట్టుబడికూడా రాలే..
నేను ఎకరాలో చామంతి పూల తోట వేశా. ఇప్పటికీ పెట్టుబడి కూడా రాలేదు. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో ధరలు బాగా ఉన్నాయి. పది రూపాయలు వస్తుందిలే అనుకుని ఆశపడ్డా. ఈ వర్షం ముంచేసింది. పెట్టుబడి కూడా రాలే. నష్టపోవాల్సిందే. – లక్కిరెడ్డి సుబ్బారెడ్డి, లిక్కిరెడ్డిపల్లె, సికెదిన్నె
పూల తోటంతా దెబ్బతినేలా ఉంది


