ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం

Sep 7 2025 7:42 AM | Updated on Sep 7 2025 7:42 AM

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం

కడప ఎడ్యుకేషన్‌ : బోధన, పరిశోధన, సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన యోగి వేమన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)– 2025లో యోగి వేమన విశ్వవిద్యాలయానికి 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీస్‌ 500 పైన ఉండగా అందులో వైవీయూ 51 నుంచి వందలోపు ర్యాంకు దక్కించుకోవడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమన్నారు. 2006లో ఏర్పాటైన వైవీయూ పాత విశ్వవిద్యాలయాలైన అనంతపురం జేఎన్టీయూ, ఎస్‌కేయూ, పద్మావతి విశ్వవిద్యాలయం వంటి వాటి సరసన నిలిచిందన్నారు. వైవీయూలో రామన్‌ ఫెలోషిప్‌, డాడ్‌ ఫెలోషిప్‌ పొందిన అధ్యాపకులు పనిచేస్తున్నారని అలాగే జర్మనీ, యూకే, యూఎస్‌ లలో పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలో సెవెన్‌ స్పోక్‌ యూనివర్సిటీలను ఎంపిక చేయగా వాటిలో ఒకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది వైవీయూ కావడం గర్వకారణం అన్నారు. తద్వారా వైవీయూలో పరిశోధనకు రూ. 10 కోట్ల నిధులు రానున్నాయన్నారు. నిర్ణీత సమయంలో భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ మంచి ర్యాంకులు యూనివర్సిటీ సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్న ఐక్యూ ఏసీ బృందాన్ని వీసీ అభినందించారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రిర్‌ ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలు, ప్లేస్‌మెంట్‌ పైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇంటర్నల్‌ క్వాలిటీ అసూరెన్స్‌ సెల్‌ (ఐక్యూ ఏసీ) సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.సుబ్రహ్మణ్యం శర్మ, పీఎం ఉషా సమన్వయకర్త డాక్టర్‌ టి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 2027 నాటికి 100 ప్రాజెక్టులతో న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ కోసం పోటీ పడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఐక్యుఏసీ అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుభాష్‌ చంద్ర, సభ్యులు డాక్టర్‌ దాక్షాయని, డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు డాక్టర్‌ పి. సరిత, డాక్టర్‌ కె. శ్రీనివాసరావు, డాక్టర్‌ తుమ్మలూరు.సురేష్‌ బాబు పాల్గొన్నారు.

వైవీయూ వైస్‌ చాన్సలర్‌

ఆచార్య అల్లం శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement