
‘కృషి’కి దక్కిన ఫలితం
● ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని
వరించిన పురస్కారాలు
● జోనల్ స్థాయిలో మూడు ప్రథమ,
ఒకటి తృతీయ స్థానం
● హర్షం వ్యక్తం చేస్తున్న
కేవీకే సమన్వయకర్త, శాస్త్రవేత్తలు
కడప అగ్రికల్చర్ : తమిళనాడులోని రాయవేలూరు వేదికగా ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగిన జోనల్ స్థాయి(ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి,తెలంగాణ రాష్ట్రాలు) కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక కార్యాచరణ కార్యశాలలో కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రానికి జోనల్ స్థాయిలో నాలుగు పురస్కారాలు లభించాయి. ఇందులో
● షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక పథకాన్ని విజయవంతంగా జిల్లాలో అమలు పరిచినందుకు ప్రథమ స్థానం.
● అపరాలు ఆదర్శ గ్రామం పథకాన్ని విజయవంతంగా నడిపిస్తునందుకు మూడవ స్థానం.
● జిల్లాలో మినుములో పల్లాకు తెగులు తట్టుకునే రకాలను విస్తరించినందుకు ప్రథమ స్థానం.
● అత్యుత్తమ ఫొటో విఽభాగంలో ప్రథమ స్థానం.
ఈ పురస్కారాలను వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ(ఆలారీ)జోన్ –10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్. వీరా, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్, జి. శివనారాయణ సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ ఈ పురస్కారాలు రావడానికి కృషి చేసిన, తోడ్పాటు అందించిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మికి, విస్తరణ సంచాలకులు డా. జి శివనారాయణ, సహాయ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డా. సుమతి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ పురస్కారాలు సాధించడానికి విశేష కృషి చేసిన పూర్వపు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వీరయ్య, కేవీకే శాస్త్రవేత్తలు, సాంకేతిక, కార్యక్రమ సిబ్బందికి సహకరించిన వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల రైతులకు, వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.