
నేటి నుంచి ఉల్లి కొనుగోలు
కడప సెవెన్‌రోడ్స్: మార్క్‌ఫెడ్ ద్వారా గురువారం నుంచి జిల్లాలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు జేసీ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి ఒక క్వింటాలు రూ. 1200 ధరతో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ, మైదుకూరు వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తాము పండించిన ఉల్లి పంటను ఇంటివద్దే శుభ్ర పరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లని ఆమె కోరారు.
పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం శ్రీరంగనాథుడు అశ్వవాహనంపై సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్‌రెడ్డి, ఈఓ కేవీ రమణ పర్యవేక్షించారు. శుక్రవారం శ్రీరంగనాథుని కల్యాణాన్ని కల్యాణదుర్గం చల్లా వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లా ఇన్ చార్జ్ ఉప రవాణా శాఖ కమిషనర్‌గా (డీటీసీ) వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నగర శివార్లలోని ఊటుకూరు ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా డీటీసీగా విధులు నిర్వహిస్తున్న ఈయన్ను ఇన్‌చార్జ్ జిల్లా డీటీసీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ సమస్యలపై కార్యాలయంలో నేరుగా సంప్రదించాలన్నారు.

నేటి నుంచి ఉల్లి కొనుగోలు