
కేసుల రాజీకి కృషి చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : నమోదైన కేసుల్లో అధిక సంఖ్యలో రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని సూచనల మేరకు బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో బుధవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత పోలీసు స్టేషన్ల వారీగా కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ముందస్తుగా సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం 08562 258622, 244622 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ హెగ్డే, కడప సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు, రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం ఆర్.కృష్ణమోహన్, మైదుకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి.రాజేంద్రప్రసాద్, ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి.భావన, కడప కోర్టు మానిటరింగ్ సెల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్