
ప్రజల దృష్టి మరల్చేందుకే ఎంపీ అక్రమ అరెస్టు
– ఎమ్మెల్యే డాక్టర్ సుధ
బద్వేలు అర్బన్ : టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. బుధవారం ఎన్‌జీఓ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారని, అందులో భాగంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఎన్ని కుయుక్తులు పడినా వైఎస్సార్‌సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని తగ్గించలేరని, నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
భవన నిర్మాణాలకు పటిష్టమైనది
భారతి సిమెంటు
సిద్దవటం : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంటు పటిష్టమైనదని భారతి సిమెంట్ టెక్నికల్ ఇంజినీర్ ఎస్. శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ అధికారి రమణారెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామంలోని మధర్ థెరిస్సా ఎంటర్ ప్రైజస్ సమీపంలో తాపీ మేసీ్త్రలకు సిమెంటు వినియోగంపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతి సిమెంటు రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. అనంతరం వారు 40 మంది మేసీ్త్రలకు లక్ష రూపాయల ఉచిత బీమా బాండ్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ కె. వెంకట్రామిరెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకే ఎంపీ అక్రమ అరెస్టు