
జగనన్న కాలనీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని మామిళ్లపల్లె పరిధిలో జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు గృహ నిర్మాణానికి లే అవుట్ వేసి స్థలాలు కేటాయించింది. పెద్ద లే–అవుట్ కావడంతో అందులో మిగిలిన ప్లాట్లపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఖాళీగా ఉన్న జాగాలలో కొందరు పునాదులు తీసి బేసిమట్టాలు వేసి తమకు తోచిన వారికి తోచిన రేటుకు బోగస్ డి– పట్టాలతో యాథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నట్లు మామిళ్లపల్లె వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. కొందరు అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై చింతకొమ్మదిన్నె తహసీల్దార్ నాగేశ్వరరావును వివరణ కోర తమ దృష్టికి వచ్చిన వెంటనే మామిళ్లపల్లె గ్రామ రెవెన్యూ అధికారిని పంపి విచారించామన్నారు. డి–పట్టాలు పొందిన వారు కాకుండా ఇతరులు ఇళ్ల నిర్మాణం చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.