
హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్టు
– కత్తి, మోటార్ సైకిల్,
నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం
కడప అర్బన్ : కడప నగరం గంజికుంట కాలనీలో గత నెల 25వ తేదిన గొంటుముక్కల వెంకటసుబ్బయ్యపై కత్తితో దాడి చేసిన కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు చిన్నచౌకు సీఐ ఓబులేసు తెలిపారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో సీఐతో పాటు ఎస్‌ఐ రాజరాజేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. కడప మాసాపేటకు చెందిన తాటిగిరి అనూష, పాలెం సుబ్బరాయుడు అలియాస్ సుబ్బన్న, చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లికి చెందిన సోమ ప్రశాంత్, సుగమాల నవీన్ అలియాస్ శిగనమాల నవీన్, సిబ్యాల సుబ్బరాయుడు మాసాపేటకు చెందిన తాటిగిరి నిర్మలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తి, మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెంకటసుబ్బయ్య, తాటిగిరి అనూష మధ్య మనస్పర్థలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీ వెంకటసుబ్బయ్యపై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు