
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం
లక్కిరెడ్డిపల్లి: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా మని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పార్టీ నాయకుడు సుగవాసి బాల సుబ్రమణ్యంలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ గొంతునొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడటానికి ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ సలహా మండలి మాజీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ స్టేట్ సెక్రటరీ గాలివీటి వీరనాగిరెడ్డి, రాజంపేట అసెంబ్లీ పబ్లిసిటీ వింగ్ మాదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి, మాన్యం సంతోష్ రెడ్డి,పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీలు అంబాబత్తిన రెడ్డయ్య, తిమ్మిరెడ్డి ఉమాపతి రెడ్డి, ఉప మండల అధ్యక్షులు సమరసింహారెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి
రమేష్‌కుమార్ రెడ్డిని పరామర్శించిన పార్టీ సీనియర్ నాయకులు