
రైతులకు సకాలంలో ఎరువులందాలి
కడప సెవెన్‌రోడ్స్: రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎరువుల నిల్వలు,విక్రయాలు, మార్కెటింగ్, పంటలు తదితర అంశాలపై వ్యవసాయ, మార్కెటింగ్, డీఎస్‌ఓ శాఖా అధికారులు, ప్రైవేట్ ఎరువుల కంపెనీల ప్రతినిధులుతో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎరువు లు అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిమాండ్ ఆధారంగా ఎరువులు ఆర్బీకేల ద్వారా అందజేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఆర్బీకేలలో 2900 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు వినియోగించుకోవాలన్నారు. ప్రైవే టు ఎరువుల డీలర్లు నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ ఈ–పాస్ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు. బల్క్‌స్టాక్ పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించడం వంటి పనులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎంత ఎరువులు అలాట్మెంట్ ఉంది,రైతులకు ఏ మేరకు విక్రయించారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందనే వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల వారీగా ఆర్బీకేలలో స్టాక్ వివరాలను ప్రతిరోజు మీడియా ద్వారా రైతు లకు తెలియజేయాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వల్లి,మార్క్ ఫెడ్ డీఎం పరిమళజ్యోతి, హార్టికల్చర్ అధికారి రవిచంద్రబాబు,డీసీఓవెంకటసుబ్బయ్య, కోర మాండల్, స్పీక్, ఐపీల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి