
సౌమ్యనాథస్వామికి రూ.6, 06,780 ఆదాయం
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 40 రోజులకు సంబంధించి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.6,06,780 వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్లు చెప్పారు. ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి జనార్ధన, భక్తులు పాల్గొన్నారు.
అన్నదాన ట్రస్టు
డిపాజిట్లు రూ.2,24,13,591
మండలంలోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం సమీపంలోని సౌమ్యనాథ అన్నదాన ట్రస్టు డిపాజిట్లు బ్యాంకు ఖాతాల్లో రూ.2,24,13,591 ఉన్నట్లు ట్రస్టు అధ్యక్షుడు ఎద్దుల సుబ్బరాయుడు, కోశాధికారి చక్రాల రామసుబ్బన్న పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం శనివారం, ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్నామని, శుక్రవారం కూడా భక్తులకు భోజనాలు ఏర్పాటు చేసేందుకు తీర్మానించినట్లు చెప్పారు.అన్నదాన సత్రంలో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి శైలేంద్రనాథ్, సభ్యులు గంట వాసుదేవయ్య, జంగంశెట్టి వెంకటసుబ్బయ్య, పల్లె సుబ్రమణ్యం, సర్దార్ హుస్సేన్, మోడపోతుల రాము, లంకాయగారి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.