
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
కడప అర్బన్ : ఐన్యూస్ ఉమ్మడి కడప జిల్లా బ్యూరో చీఫ్ శ్రీనివాసులుతో పాటు ప్రొద్దుటూరు రిపోర్టర్ చెన్నయ్యపై నిరాధారమైన ప్రచారం చేసి వారి గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు ఎం. బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు వారు సోమవారం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ తక్షణమే కేసు నమోదు చేసి వారంలోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే నాయకులు మాట్లాడుతూ సంస్థకు తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేయడమే కాకుండా, మహిళలను అందులో ప్రస్తావించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా గౌరవాధ్యక్షుడు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఐన్యూస్ బ్యూరో చీఫ్ శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యుజే నాయకులు సర్దార్, సుబ్బారెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, శ్యామ్, వీరాంజనేయులు, భువనేశ్వర్ రెడ్డి, పూల వెంకటసుబ్బయ్య, చెన్నయ్య, నరసింహులు, సునీల్ కుమార్ పాల్గొన్నారు.