
● ఒంటికాలిపై నిరసన
కడప కార్పొరేషన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఆదివారం కార్మికులు ఒంటికాలిపై నిల్చొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తాము గొంతెమ్మ కోర్కె లు కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తక్కువ వేతనాలు తీసుకుంటున్న కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సోమవారం నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఎస్. రవి, గోపి, కె. శ్రీరామ్, కిరణ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.