సిమెంట్‌ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు | - | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు

Jul 21 2025 5:41 AM | Updated on Jul 21 2025 5:41 AM

సిమెం

సిమెంట్‌ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు

చాపాడు : మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లే సిమెంట్‌ రోడ్డు ధ్వంసం ఘటనపై పడమర అనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులైన నందిమండలం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు బాల సుబ్బారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లేదారిలో ఐదేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో సిమెంట్‌ రోడ్డు నిర్మించారని, ఈ స్థలం తమదని శనివారం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు రోడ్డును తొలగించడంపై అక్కడి దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇరువర్గాల గొడవ

– ఇద్దరు యువకులకు గాయాలు

పులివెందుల రూరల్‌ : పట్టణంలోని రింగ్‌ రోడ్డు సమీపంలో ఉన్న వైఎస్సార్‌ కాలనీలో ఆదివారం సాయంత్రం ఇరువర్గాలవారు గొడవపడ్డారు. దీంతో వంశీ, వలీ అనే యువకులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మారుతీహాలు సమీపంలో నివాసం ఉంటున్న వంశీ న్యాక్‌ బిల్డింగ్‌ సమీపంలో ఉన్న ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమించాలని వేధిస్తుండేవాడు. కాలనీవాసులు అనేక మార్లు మందలించినా వినలేదు. ఈ నేపథ్యంలో వంశీ తన మిత్రులతో కలిసి ఆదివారం కాలనీలో ఉన్న యువతి ఇంటి దగ్గరకి వెళ్లి గొడవకు దిగాడు. దీంతో స్థానికుల దాడిలో వంశీ, వలీ అనే మరో యువకుడికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దాడి సంఘటనపై కేసు నమోదు

తొండూరు : తొండూరు మండలం ఇనగనూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు దస్తగిరి రెడ్డి (బాబురెడ్డి) మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఘణ మద్దిలేటి తెలిపారు. శనివారం ఇనగనూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సమరసింహారెడ్డి, హరికిషోర్‌రెడ్డిలు ద్విచక్ర వాహనంలో పులివెందులకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దస్తగిరి రెడ్డి కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రాడ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడికి సంబంధించి ఆదివారం దస్తగిరిరెడ్డితో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

గ్రామంలో పోలీస్‌ పికెట్‌..

ఇనగనూరు గ్రామంలో దస్తగరి రెడ్డి, బాల ఓబుల్‌రెడ్డిలు పరస్పరం దాడి చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదేశాల మెరకు పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ద్విచక్రవాహనదారుడికి

తీవ్ర గాయాలు

ముద్దనూరు : మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో ఓ డాబా వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పులివెందులకు చెందిన రవిశంకర్‌ అనే వ్యక్తి మోటార్‌బైక్‌లో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. కిందపడిన క్షతగాత్రున్ని కొద్దిదూరం అలాగే లాక్కొని వెళ్లింది. దీంతో అతని చేతికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పట్టపగలే చోరీ

రాజుపాళెం : మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామంలో రెండు ఇళ్లల్లో పట్టపగలే దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాజుపాళెం ఎస్‌ఐ వెంకటరమణ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని గోపిరెడ్డి సుస్మిత, ప్రభావతి ఇళ్లల్లో దొంగలు పడ్డారు. ప్రభావతి ఇంటిలో దొంగలకు ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి వారు గోపిరెడ్డి సుస్మిత ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు ఉన్న బీగాలను పగుల గొట్టారు. బీరువాను పగులగొట్టి దుస్తులను చెల్లాచెదురుగా వేసి 5 తులాల బంగారు దొంగిలించినట్లు సుస్మిత ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్‌ఐ వెంకటరమణ, ఏఎస్‌ఐలు రామకృష్ణారెడ్డి, సిద్ధయ్య, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. దొంగతనం జరిగిన ఇంటిలో క్లూస్‌ టీం వేలిముద్రలు సేకరించారు సంఘటనపై గోపిరెడ్డి సుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సిమెంట్‌ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు1
1/2

సిమెంట్‌ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు

సిమెంట్‌ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు2
2/2

సిమెంట్‌ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement