
ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!
ఎదురుచూడటం తప్ప...
అన్నదాత సుఖీభవ నిధుల కోసం ఎదురుచూస్తున్నాం. గతేడాది ఒక్క రుపాయి కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఖరీప్ సీజన్ కూడా ప్రారంభమయింది. వర్షా లు పడుతున్నాయి. పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికై నా అన్నదాత సుఖీభవ నిధులను ఇస్తే పెట్టుబడికి సాయంగా ఉంటుంది. – చిన్న సుబ్బరాయుడు,
కానపల్లి, పొద్దుటూరు మండలం
కడప అగ్రికల్చర్: ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 20 వేలు అందజేస్తాం. ఎరువుల, విత్తనాలను సకాలంలో సరఫరా చేస్తాం. ఎక్కడ ఎరువుల కొరత లేకుండా చేస్తాం..’ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊదరకొట్టిన మాటలివి. అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారు అన్నదాతలకిచ్చిన వాగ్దానాలు మాత్రం గాలిలో కలిసి పోయాయి. ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం పరుగులు తీస్తున్నారు. అన్నదాత సుఖీభవ నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖరీఫ్, రబీ రెండు సీజన్లు ముగిశాయి. రెండు సీజన్లకు ఒక్క రుపాయి కూడా విడదల కాలేదు. మళ్లీ తాజాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు రెండు నెలలు కావొస్తుంది. ప్రస్తుతం జిల్లాలో వర్షాలతోపాటు కేసీ కాలువకు నీటిని కూడా వదిలారు. ఇక అన్నదాతలు కాడీ మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమతున్నారు. ఇప్పుడు రైతన్నలకు పెట్టబడి సాయం అవసరం. విత్తనాలు, ఎరువులను తెచ్చుకునేందుకు డబ్బులు ఎంతో అవసరం. కానీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ఇప్పటికి ఒక క్లారిటి ఇవ్వలేదు. ఇటీవలే రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి ఈకేవైసీ కూడా తీసుకున్నారు. కానీ నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో అన్నదాతలు ఊసూ రుమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 77475 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకానున్నాయి.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 205600 మంది రైతులకు రైతు భరోసా ఇవ్వగా ఈ ఏడాది ఈకేవైసీ పేరుతో దాదాపు 9700 మంది రైతులకు జిల్లాలో కోత విధించి 1,95,892 మంది రైతులు అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. వీరికై నా సకాలంలో నిధులను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఠంచన్‌గా కేంద్ర ప్రభుత్వ సాయం...
పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఠంచన్‌గా సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా మూడు విడతల్లో 6 వేలు సాయం అందచేస్తామని ప్రకటించింది. ఈ మేరకు గతేడాది జూన్ నెలలో రూ. 2 వేలు, అక్టోబర్‌లో 2 వేలుతోపాటు ఈ ఏడాది మార్చి నెలలో మూడవ విడదను విడుదల చేసింది. ఇలా జిల్లావ్యాప్తంగా గతేడాది 1.89 లక్షల మంది రైతులకు ఒకొక్కరికి 2 వేల చోప్పున రూ. 37.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు వివరాలు ఇలా..
సంవత్సరం రైతుల విడుదలైన నిధులు
సంఖ్య (కోట్లలో)
వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో...
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న ఐదెళ్లలో పంటల సాగుకోసం క్రమం తప్పకుండా పెట్టబడి సాయం అందించింది. ఏటా ఖరీప్ ఆరంభంలోనే పెట్టుబడి సాయాన్ని అందించి పంటలసాగుకు చేయూత నిచ్చింది. కానీ కూటమి ప్రభుత్వంలో పంటలసాగుకు అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. దీనికితోడు గత ఖరీఫ్, రబీ సీజన్‌లలో అకాల వర్షాలు, తుఫాలతో రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. వారిని కూడా కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడి కూడా ఇవ్వలేదు. ఇటు ఇన్‌పుట్ సబ్సిడీ అందక.. అటు అన్నదాత సుఖీభవ నిధులు రాక జిల్లా రైతులు నష్టపోయారు.
ఇతని పేరు ఆదినారాయణరెడ్డి. ఊరు పెండ్లిమర్రి మండలం కోనాయపల్లె. ఐదు ఎకరాల మెట్ట పొలం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మినుము, బుడ్డ శనగ సాగు చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం విత్తనాలు అవసరం. ప్రభుత్వం అన్నదాత సుభీభవ నిధులను విడుదల చేస్తే పంటలసాగుకు ఆసరాగా ఉంటుందని, విత్తనాలు, ఎరువులను తెచ్చుకునేందుకు వీలుగా ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆలస్యం చేస్తే సాగుకైన దూరం కావాల.. లేదంటే బయట వ్యక్తుల వద్ద అప్పైన చేయాల. జిల్లా వ్యాప్తంగా రైతుల దుస్థితి ఇది.
రెండేళ్ల నిధులు ఇవ్వాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. గతేడాది రైతులకు ఇవ్వా ల్సిన అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదు. దీంతో చాలా మంది రైతులు నష్టపోయారు. గతేడాది అన్నదాత సుఖీభవ నిధులతో కలిసి ఈ ఏడాది నిధులను ఇచ్చి రైతులను ఆదుకోవాలి.– భాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ
అన్నదాత సుఖీభవ నిధుల విడుదలెప్పుడో
ఈకేవైసీ పూర్తయినా నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వని సర్కార్
విత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు అప్పులు
భూమి ఉన్న ప్రతి రైతుకు ఇవ్వాలి
అన్నదాత సుఖీభవ నిధులను భూమి ఉన్న ప్రతి రైతుకు ఇవ్వాలి. అలాగే కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. ఈకేవైసీ పేరుతో జాబితా నుంచి రైతుల పేర్లను తొలగించచడం అన్యాయం. దీంతో చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ నిధులురాక నష్టపోనున్నారు. –దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. సీపీఎం
2019–20 206708 279.93
2020–21 208747 280.06
2021–22 199344 269.11
2022–23 202598 235.68
2023–24 205600 277.56

ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!

ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!

ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!

ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!

ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!

ఎన్నాళ్లీ.. ఎదురుచూపులు!