
యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డి సర్కిల్: నిరుద్యోగ యువతకు బెంగుళూరులోని ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, ట్యాలీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సెంటర్ అడ్మిషన్స్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమో, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు 18 నుంచి 28ఏళ్ల లోపు ఉండాలన్నారు. 35రోజులపాటు శిక్షణ ఉంటుందని, శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఇతర వివరాలకు 9000487423 అనే ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
నేడు చైల్డ్ డెవలప్‌మెంట్‌పై అవగాహన సదస్సు
కడప కార్పొరేషన్: పిల్లల ఎదుగుదల, తెలివితేటలు, ఎదుగుదలలోని లోపాలను, చదువులో వెనుకబాటుతనం, మాట సరిగా రాకపోవడం, వినికిడి లోపాలు మొదలగు సమస్యలపై అనుభవజ్ఞులైన వైద్యులచే అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అస్యూర్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మద్రాసు రోడ్డులోని ఐఎంఏ హాలులో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ అవగాహన సదస్సులో ఆటిజమ్– ఆక్టివిటీ, బుద్ధిమాంద్యం తదితర సమస్యలపై కూడా వైద్యులు పరీక్షిస్తారన్నారు. చిన్న పిల్లల వైద్యులు హాజరై అవగాహన కల్పిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
నేటితో గడువు ముగింపు
కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్‌లో 2వ విడత అడ్మిషన్లకు 20వ తేదీతో గడువు ముగుస్తుందని ప్రభుత్వ మైనారిటీస్ ఐటీఐ ప్రధానాచార్యులు జ్ఞానకుమార్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా పెయిల్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ .. ఆపై అర్హతలు ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని తెలిపారు. అభ్యర్థులు నేరుగా తమ 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్, ఫొటో, మొయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తీసుకుని ఐటీఐ వద్దకు వచ్చి ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా iti.ap.gov.in అను పోర్టల్‌లో దరఖాస్తును సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా కూడా దరఖాస్తు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
కోదండ రామయ్యకు
స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యా ల నడుమ స్నపన తిరుమంజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో సుప్రభాత సమయాన శ్రీరామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, అభిషేక సామగ్రి సమ ర్పించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణ మూర్తులకు అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో ముస్తాబు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేద పారాయణం, సహస్త్ర నామార్చన, కుంకుమార్చన, మంగళహారతులతో విశేష పూజలు నిర్వహించారు.
పాఠశాల తనిఖీ
బద్వేలు: బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శనివారం ప్రాంతీయ విద్యా సంచాలకులు కె.శామ్యూల్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థునులకు అవసరమైన వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల సమావేశ మందిరంలో జరుగుతున్న పాఠశాల సముదాయ ఉపాధ్యాయుల సమావేశ ంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌జేడి శామ్యూల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎవరి పాఠ్యాంశంలో వారు అంకితభావంతో ఆహ్ల్లాదకరమైన వాతావరణలో నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్న ప్రతి నిమిషాన్ని విద్యార్థుల ఉన్నతికి ఉపయోగించాల ని తెలిపారు. అనంతరం పాఠశాలలోని సర్వేపల్లి రాధాక్రిష్ట విద్యామిత్ర కిట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖాధికారి చెన్న య్య, హెచ్‌ఎం కొండా వెంకటరామిరెడ్డి మాట్లాడారు. పాఠశాల సముదాయ ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

యువతకు ఉచిత శిక్షణ