
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సింగసాని గురుమోహన్, కల్లూ రు నాగేంద్రారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు) నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించడం జరుగుతుందని, వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయ కారిగా వ్యవహరించనున్నారు. కాగా సింగసాని గురుమోహన్ బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, కడప అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా పనిచేశారు. కల్లూరు నాగేంద్రారెడ్డి ప్రొద్దుటూరు మండల కన్వీనర్‌గా, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా పనిచేశారు. వీరు పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఈ పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం